Sunday, July 19, 2026
HomeMovie Newsపిక్ ఆఫ్ ది డే: బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్..

పిక్ ఆఫ్ ది డే: బావమరిది పెళ్లిలో ఎన్టీఆర్..

jr-ntr-narne-nithin-wedding-viral-photo-3102bc

న్యూస్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ తన బావమరిది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో తన బాధ్యతను చాటుకుంటూ అతిథులను ఆహ్వానించడం, కొత్త జంటను దీవించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జీలకర్ర బెల్లం ఘట్టం సమయంలో, తారక్ తన భార్య లక్ష్మీ ప్రణతితో కలిసి వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా, తారక్‌కు సోదరి వరస అయ్యే లక్ష్మీ శివాని తలపై చేయి ఉంచి దీవించిన ఫోటో ‘పిక్ ఆఫ్ ది డే’గా ట్రెండ్ అవుతోంది.

శంకర్‌పల్లిలో శుక్రవారం రాత్రి ఘనంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఎన్టీఆర్, ప్రణతి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తారక్ క్రీమ్ అండ్ గోల్డ్ షేడింగ్ కుర్తాలో, ప్రణతి గోల్డ్ కోటింగ్ శారీలో కనిపించారు. వీరు స్వయంగా అతిథులను ఆహ్వానించారు.

ఈ పెళ్లికి ఇండస్ట్రీకి చెందిన విక్టరీ వెంకటేశ్, రానా దగ్గుబాటి, నాగ చైతన్య, రాజీవ్ కనకాల సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. తారక్ చిన్న కుమారుడు అభయ్ కూడా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. భార్గవ్ రామ్ అల్లరి, తన పెదనాన్న కల్యాణ్ రామ్‌తో చేసిన చిలిపి పనులు అందరినీ ఆకర్షించాయి.

నార్నే నితిన్, లక్ష్మీ శివాని తాళ్లూరి కృష్ణప్రసాద్- స్వరూప దంపతుల కుమార్తెను వివాహం చేసుకున్నారు. నార్నే నితిన్, ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడు. నార్నే నితిన్ ‘మ్యాడ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి మంచి విజయాలు అందుకున్నారు.

పాన్ ఇండియా స్టారైనా, షూటింగ్ ప్యాకప్ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా ఫ్యామిలీ మ్యాన్‌లా మారిపోతారు. కుటుంబానికే మొదటి ప్రాధాన్యతను ఇస్తానని ఆయన గతంలో చాలాసార్లు చెప్పారు. ఈ పెళ్లి వేడుకలోనూ ఆయన ఆ బాధ్యతను, కుటుంబ అనుబంధాన్ని చూపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular