Saturday, October 3, 2026
HomeAndhra Pradesh"నీ అంతు చూస్తా".. ఏఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!

“నీ అంతు చూస్తా”.. ఏఎస్పీపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు!

jc-prabhakar-reddy-warns-asp-rohit-choudary-tadipatri

అనంతపురం: తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి వేడెక్కింది. టీడీపీ నేత, జెడ్పీ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈసారి ఏకంగా ఓ ఏఎస్పీపైనే బహిరంగంగా విరుచుకుపడ్డారు. పోలీసుల అమరవీరుల సంస్మరణ సభ వేదికగా ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు, బెదిరింపులు ఇప్పుడు పెను దుమారం రేపుతున్నాయి.

స్థానిక అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరిని ఉద్దేశించి జేసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఎస్పీకి “బుద్ధి, జ్ఞానం లేదని”, ఆయనొక “పనికిరాని వాడని” ఘాటుగా విమర్శించారు. ఘర్షణలు జరిగినప్పుడు ఇంట్లో దాక్కుని, అంతా అయ్యాక బయటకు వస్తారంటూ ఎద్దేవా చేశారు.

అంతటితో ఆగకుండా, “ఏయ్ ఏఎస్పీ, నీ అంతు చూస్తా. నీ దగ్గర తుపాకులుంటే నా దగ్గరా ఉన్నాయి. మౌనంగా ఉన్నా, కానీ మాట్లాడితే నీ ఇంట్లోకి దూరి చూపిస్తా” అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి రెచ్చిపోయారు. ఈ వ్యాఖ్యలతో అక్కడున్న వారంతా నివ్వెరపోయారు.

కేవలం రెండు రోజుల క్రితమే, తాడిపత్రిలో వైసీపీ నేత నాగేశ్వరరెడ్డిపై జేసీ అనుచరులు ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. జేసీ రెచ్చగొట్టడంతోనే ఈ దాడి జరిగిందని బాధితుడు ఆరోపించారు.

టీ తాగుతున్న నాగేశ్వరరెడ్డిని చూసి, “ఇంకా ఎందుకు వదిలేశారు” అని జేసీ వ్యాఖ్యానించిన వెంటనే ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారని సమాచారం. తీవ్రంగా గాయపడిన బాధితుడు, ప్రాణభయంతో మరో నేత ఇంట్లో తలదాచుకోవాల్సి వచ్చింది.

ఈ వరుస ఘటనలతో తాడిపత్రిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జేసీ వ్యాఖ్యలపై పోలీసు శాఖ తీవ్ర అసంతృప్తితో ఉండగా, ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular