
న్యూస్ డెస్క్: అమెరికాలోని రెండు ప్రముఖ సంస్థలకు భారతీయ మూలాలు కలిగిన నేతలు సీఈవోలుగా బాధ్యతలు చేపట్టడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గ్లోబల్ బిజినెస్ రంగంలో భారత్ ప్రతిభ మరింత వెలుగులోకి వచ్చింది.
మొదటగా టీ-మొబైల్ కంపెనీ సీఈవోగా శ్రీనివాస్ గోపాలన్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు COOగా పనిచేసిన ఆయన నవంబర్ 1 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. మైక్ సీవర్ట్ స్థానంలో వస్తున్న ఆయనకు విస్తృత అనుభవం ఉంది. భర్తీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ వంటి సంస్థల్లోనూ కీలక పదవుల్లో పని చేశారు.
ఇక మోల్సన్ కూయర్స్ పానీయాల కంపెనీకి రాహుల్ గోయల్ కొత్త సీఈవోగా ఎంపికయ్యారు. షికాగో కేంద్రంగా ఉన్న ఈ కంపెనీలో అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. దాదాపు రెండు దశాబ్దాల అనుభవం కలిగిన ఆయన, అమెరికా, యుకే, ఇండియాలో ఈ బ్రాండ్‌కి సేవలు అందించారు.
భారతీయ ప్రతిభ మరోసారి గ్లోబల్ స్థాయిలో నిలదొక్కుకోవడం విశేషం. ముఖ్యంగా టెక్, మేనేజ్‌మెంట్ రంగాల్లో ఇండియన్స్ సత్తా చాటుతున్నారు. స్థానిక ఉద్యోగాలపై విదేశీయుల ప్రభావం అనే విమర్శల మధ్యా ఈ నియామకాలు జరిగాయి.
ఇది భారత యువతకు పెద్ద స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషి, ప్రతిభ, లీడర్‌షిప్ సామర్థ్యాలతో అంతర్జాతీయ స్థాయిలో ఎదగవచ్చని నిరూపిస్తోంది.
