
న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025లో భారత్, పాకిస్థాన్ మళ్లీ ఫైనల్లో తలపడుతున్నారు. లీగ్ మ్యాచ్, సూపర్ 4లో ఇండియా గెలిచినా, ఫైనల్ వాతావరణం ఎప్పుడూ వేరేలా ఉంటుంది. కాబట్టి సూర్యకుమార్ సేన జాగ్రత్తగా ఆడాలి.
పాకిస్థాన్ బౌలింగ్ ఎప్పుడూ స్ట్రాంగ్ పాయింట్. బ్యాటింగ్‌లో లోపాలు ఉన్నా, ఒక స్పెల్‌తోనే మ్యాచ్ తిప్పేయగలిగే బౌలర్లు వారివద్ద ఉన్నారు. మరోవైపు ఇండియా బ్యాటింగ్ బలంగా ఉన్నా, ప్రెజర్ సిట్యువేషన్స్‌లో జాగ్రత్త అవసరం.
ఈసారి సెంటిమెంట్ ఫ్యాక్టర్ కూడా హాట్ టాపిక్. పాకిస్థాన్ ఇతర ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో ఇండియాపై ఎక్కువ విజయాలు సాధించింది. గతంలో 1986, 1991, 1994, 1999, 2017 వంటి ఫైనల్స్‌లో పాక్ ఆధిపత్యం చూపింది. ఇది టీమ్ ఇండియాకు ఒక హెచ్చరికే.
అయితే ప్రస్తుత రికార్డులు మాత్రం ఇండియా వైపు చూపుతున్నాయి. చివరి పది మ్యాచ్‌లలో ఎనిమిదింటిని భారత్ గెలిచింది. ఇది జట్టు ఫామ్ ఎంత బలంగా ఉందో చెబుతోంది. కానీ అభిషేక్ తప్ప మిగతా బ్యాట్స్మెన్లు పెద్ద ఇన్నింగ్స్ ఆడకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
బౌలింగ్‌లో బుమ్రా, కుల్దీప్, వరుణ్ కీలక పాత్ర పోషించవచ్చు. వీళ్ళు రిథమ్‌లో ఉంటే పాక్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడం కష్టం కాదు. కానీ ఒక తప్పిదం జరిగినా, పాకిస్థాన్ వెంటనే ఆ అవకాశాన్ని క్యాష్ చేసుకునే జట్టు.
మొత్తానికి, సెంటిమెంట్ ఒక వైపు, ప్రస్తుత ఫామ్ మరోవైపు నిలిచాయి. ఈసారి ఎవరి వైపు లక్ కలుస్తుందో చూడాలి.
