Sunday, July 19, 2026
HomeSportsఐదో టీ20 వర్షార్పణం.. 2-1తో సిరీస్ భారత్ కైవసం!

ఐదో టీ20 వర్షార్పణం.. 2-1తో సిరీస్ భారత్ కైవసం!

న్యూస్ డెస్క్: ఆస్ట్రేలియాతో బ్రిస్బేన్ వేదికగా జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. ఇప్పటికే మూడో, నాలుగో టీ20ల్లో గెలిచి ఆధిక్యంలో ఉన్న టీమిండియా, ఈ మ్యాచ్ రద్దవడంతో సిరీస్‌ను కైవసం చేసుకుంది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్, మ్యాచ్ నిలిచిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (23*), శుభ్‌మన్ గిల్ (29*) మరోసారి దూకుడైన ఆరంభాన్నిచ్చారు.

ఆట ఊపందుకుంటున్న సమయంలోనే ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం మొదలైంది. పిడుగులు పడే సూచనతో స్టేడియం సిబ్బంది ప్రేక్షకులను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు. గబ్బా డ్రైనేజీ వ్యవస్థ అద్భుతంగా ఉన్నా, వర్షం తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన భారత ఓపెనర్ అభిషేక్ శర్మ “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్”గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలోనే అభిషేక్ అరుదైన రికార్డు సృష్టించాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 1000 పరుగులు పూర్తి చేసిన రెండో భారత ఆటగాడిగా అభిషేక్ (28 ఇన్నింగ్స్‌లు) నిలిచాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (27 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular