
న్యూస్ డెస్క్: సంచలనం సృష్టించిన ఐబొమ్మ నిర్వాహకుడు రవి అరెస్టుకు సంబంధించి ఇప్పుడు కొత్త వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకు భార్యే పోలీసులకు సమాచారం ఇచ్చిందని భావించినా, అసలు దారి వేరే ఉందని పోలీసు వర్గాలు అనధికారికంగా వెల్లడిస్తున్నాయి. రవి అరెస్టుకు కారణం ఒక స్నేహితుడికి పెట్టిన చిన్న మెసేజ్ అని తెలుస్తోంది.
టెక్నికల్ గా దొరికిన చిన్న క్లూ ఆధారంగానే సైబర్ పోలీసులు రవిని ట్రాక్ చేశారు. ఐబొమ్మ రవి.. ఈఆర్ ఇన్ఫోటెక్ కంపెనీ పేరుతో ఒక డొమైన్ కొనుగోలు చేశాడు. ఈ వివరాల ఆధారంగా పోలీసులు అతని ఫోన్ నంబరును గుర్తించారు.
ఎక్కువ సమయం విదేశాల్లో ఉండే రవి, హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా కూకట్‌పల్లిలోని తన స్నేహితుడిని కలుస్తూ ఉంటాడు. వీరిద్దరికీ కలిసి మద్యం సేవించే అలవాటు ఉంది. ఈ స్నేహితుడి ఫోన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు.
ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవి, ఎప్పటిలాగే తన స్నేహితుడికి “మామా హైదరాబాద్ వచ్చా” అని మెసేజ్ పెట్టాడు.
ఈ మెసేజ్‌ను అదునుగా తీసుకున్న పోలీసులు, ఆ స్థానాన్ని కన్ఫర్మ్ చేసుకుని, వెంటనే కూకట్‌పల్లిలో ఉన్న రవిని అరెస్టు చేశారు.
రవి భార్యే పట్టించిందన్న వాదన ఉన్నప్పటికీ, ఈ ‘టెక్నికల్ ట్రాకింగ్ మెసేజ్’ కథనం అరెస్టు వెనుక ఉన్న కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది.
