Tuesday, October 6, 2026
HomeMovie News'ఐ-బొమ్మ' అడ్డా కూలింది.. ఫ్రాన్స్ నుంచి రాగానే అదుపులోకి!

‘ఐ-బొమ్మ’ అడ్డా కూలింది.. ఫ్రాన్స్ నుంచి రాగానే అదుపులోకి!

ibomma-owner-ravi-arrested-in-hyderabad-kukatapally

కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్‌ను పైరసీ చేస్తూ టాలీవుడ్ నిర్మాతలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘ఐ-బొమ్మ’ (iBomma) వెబ్‌సైట్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఈ పైరసీ సైట్ వల్ల పరిశ్రమకు రూ. 2,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు నిర్మాతలు గతంలో ఫిర్యాదు చేశారు.

ఈ పైరసీ నెట్‌వర్క్ వెనుక సూత్రధారి రవి అనే వ్యక్తి అని గుర్తించిన హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు, అతని కోసం గాలింపు చేపట్టారు. రవి కరేబియన్ దీవుల నుంచి ఈ వెబ్‌సైట్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

గతంలో రవి తనను పట్టుకోవాలంటూ పోలీసులకే సవాల్ విసిరినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల అతను ఫ్రాన్స్ నుంచి నేరుగా హైదరాబాద్‌కు వచ్చినట్లు సమాచారం అందుకున్న పోలీసులు పక్కా వ్యూహంతో వల పన్నారు.

కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్న రవిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ అరెస్ట్‌తో ఐ-బొమ్మ కథ ముగిసినట్లేనని భావిస్తున్నారు.

అరెస్ట్ అనంతరం, పోలీసులు సర్వర్లను పరిశీలిస్తున్నారని, అతని బ్యాంక్ ఖాతాల్లోని రూ. 3 కోట్లను ఫ్రీజ్ చేసినట్లు సమాచారం. విదేశాల్లో ఒంటరిగా ఉంటున్న రవి, హైదరాబాద్ రాగానే పోలీసులకు చిక్కడం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 6149393256ac4ec205a1fe