Friday, September 4, 2026
HomeAndhra Pradeshభార్యను నెట్ లో అమ్మకానికి పెట్టిన శాడిస్ట్ భర్త

భార్యను నెట్ లో అమ్మకానికి పెట్టిన శాడిస్ట్ భర్త

HUSBAND-POSTS-WIFE-PHOTOS-ONLINE-FOR-DOWRY

చిత్తూరు : ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతిలో భార్య పై ఒక శాడిస్టు భర్త వేధింపులు బయటపడ్డాయి. భార్య నగ్న ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తనను వేధింపులకు గురిచేస్తున్న ఓ భర్త కుటిల బుద్ధి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భార్యను డబ్బు కోసం అంగట్లో సరుకుగా మార్చాడా ప్రబుద్ధుడు.

తిరుపతిలోని స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, టీటీడీలో జూనియర్ అసిస్టెంటుగా పని చేస్తున్న రేవంత్ అనే వ్యక్తికి నాలుగు నెలల కిందట నిరోషా అనే అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ.10 లక్షల విలువైన బంగారంతో పాటు రూ.10 లక్షల నగదు కట్నంగా తీసుకున్నాడు. కానీ మళ్ళీ ఇంకా మరింత డబ్బు కావాలంటూ భార్యను వేధించసాగాడు.

నిరోషా ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ, కాల్ గాల్ అనీ, గంటకు రూ.3 వేలు అంటూ పోస్టులు పెడుతున్నాడు. అంతేకాకుండా శారీరకంగా కూడా వేదిస్తున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేక బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మహిళా సంఘాలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది.

ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రేవంత్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధితురాలికి న్యాయం చేస్తామని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 13968774166a9b1e7ce70c4