Sunday, July 12, 2026
HomeNationalస్మశానంలో క్రిమినల్… మహిళల సమాధులు తవ్వి కలకలం

స్మశానంలో క్రిమినల్… మహిళల సమాధులు తవ్వి కలకలం

graveyard-ritual-crime-in-madhya-pradesh

మధ్యప్రదేశ్: ఖాండ్వా జిల్లాలో భయానక ఘటన బయటపడింది. స్మశానంలో ఒక వ్యక్తి అమానుష చర్యలకు పాల్పడుతున్నాడు. అమావాస్య రాత్రుల్లో మహిళల సమాధులు తవ్వి క్షుద్ర పూజలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

నిందితుడు అయూబ్ ఖాన్. పగటి పూట కొత్త సమాధులను గుర్తించి, రాత్రి వేళ తవ్వేవాడని సమాచారం. అక్కడ మంత్రవిద్యకు సంబంధించిన పూజలు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటివరకు మూడు సమాధులపై ఇలాంటి పనులు చేసినట్లు తేలింది.

అయూబ్ క్రిమినల్ రికార్డు కూడా గంభీరంగా ఉంది. 2010లో భార్య హత్య కేసులో 13 ఏళ్ల శిక్ష అనుభవించాడు. ఇంకా 11 క్రిమినల్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటీవల బడా కబ్రస్తాన్‌లో శవాలను తారుమారు చేసిన ఘటనలు బయటపడ్డాయి.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా 50 ఏళ్ల అయూబ్‌ను పోలీసులు పట్టుకున్నారు. సీన్ రీ క్రియేషన్ సమయంలో స్థానికులు పెద్ద సంఖ్యలో చేరి నిందితుడిని తమకు అప్పగించాలంటూ డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ అధికారి మనోజ్ కుమార్ రాయ్ మాట్లాడుతూ, జైలు నుండి విడుదలైన తర్వాత అయూబ్ క్షుద్ర పూజల కోసం ఈ పనులు చేస్తున్నాడని వెల్లడించారు. తన శక్తులను పెంచుకోవాలనే నమ్మకంతో శవాలను తవ్వుతున్నాడని చెప్పారు.

ఈ ఘటనతో ఖాండ్వా జిల్లా ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. స్మశానవాటికలో రాత్రిళ్లు భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు మరిన్ని విచారణలు కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular