Saturday, October 3, 2026
HomeMovie News83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2026: నామినేషన్ ‌లో నిలిచిన చిత్రాలివే!

83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 2026: నామినేషన్ ‌లో నిలిచిన చిత్రాలివే!

golden-globe-awards-2026-nominations-one-battle-after-another-top-list

83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల సందడి మొదలైంది. 2026 సంవత్సరానికి నామినేట్ అయిన చిత్రాల జాబితాను కాలిఫోర్నియాలోని బెవర్లీ హిల్స్‌లో ప్రకటించారు. హాలీవుడ్ నటులు మార్లాన్ వెయెన్స్ స్కై పి మార్షల్ ఈ నామినేషన్లను లైవ్ ఈవెంట్‌లో తెలిపారు.

ఈసారి లియోనార్డో డికాప్రియో నటించిన వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రం ఏకంగా ఎనిమిది విభాగాల్లో నామినేట్ అయి మొదటి స్థానంలో నిలిచింది. నార్వేజియన్ చిత్రం సెంటిమెంటల్ వ్యాల్యూ కూడా ఎనిమిది నామినేషన్లతో మొదటి స్థానం పంచుకుంది. ది వైట్ లోటస్ ఆరు విభాగాల్లో నామినేట్ అయ్యింది.

కీలక కేటగిరీలలో నామినేషన్లు:

  • ఉత్తమ చిత్రం – డ్రామా: ఫ్రాంకెన్‌స్టైన్, హామ్నెట్, ది సీక్రెట్ ఎజెంట్, సెంటిమెంటల్ వ్యాల్యూ, సిన్నర్స్, వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ వంటి చిత్రాలు పోటీ పడుతున్నాయి.
  • ఉత్తమ నటి – డ్రామా: జెస్సీ బక్లే (హ్యామ్నెట్), జెన్నిఫర్ లారెన్స్ (డై మై లవ్), రెనేట్ రీన్స్‌వే (సెంట్ మెంటల్ వ్యాల్యూ) జూలియా రాబర్ట్స్ (ఆఫ్టర్ ది హంట్) బరిలో ఉన్నారు.
  • ఉత్తమ నటుడు – డ్రామా: జోయెల్ ఎడ్జర్టన్ (ట్రెయిన్ డ్రీమ్స్), ఆస్కర్ ఐక్ (ఫ్రాంకెన్‌స్టైన్), మైకెల్ బి జోర్డాన్ (సిన్నర్స్) వంటి వారు నామినేట్ అయ్యారు.
  • ఉత్తమ నటుడు – మ్యూజికల్ కామెడీ: టిమోతి చలమేట్, జార్జ్ క్లూనీ, లియోనార్డో డికాప్రియో, ఇథాన్ హాక్ వంటి స్టార్స్ నామినేట్ అయ్యారు.
  • దర్శకుడు: పాల్ థామస్ ఆండర్సన్, రియాన్ కూల్గర్, గిలెర్మో డెల్ టోరో, క్లో జావో వంటి ప్రముఖులు పోటీలో ఉన్నారు.

నాన్ ఇంగ్లీష్ చిత్రాలు:

నాన్ ఇంగ్లీష్ సినిమాల విభాగంలో ఇట్ వాస్ జస్ట్ అన్ యాక్సిడెంట్, నో అదర్ చాయిస్, ది సీక్రెట్ ఏజెంట్, సెంటిమెంటల్ వ్యాల్యూ, సిరాట్ వంటి చిత్రాలు నామినేట్ అయ్యాయి.

బాక్స్ ఆఫీస్ అచీవ్‌మెంట్:

సినిమాటిక్ బాక్స్ ఆఫీస్ అచీవ్‌మెంట్ కేటగిరీకి అవతార్: ఫైర్ అండ్ యాష్, కెపాప్ డిమోన్ హంటర్స్, మిషన్: ఇంపాసిబుల్ – ది ఫైనల్ రికనింగ్ వంటి కమర్షియల్ రిలీజ్‌లు పోటీలో ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular