Friday, December 12, 2025
HomeMovie Newsఫ్రాంచైజీ మాయ జ పనిచేయదు.. కొత్తదనం లేకుంటే తిప్పలే!

ఫ్రాంచైజీ మాయ జ పనిచేయదు.. కొత్తదనం లేకుంటే తిప్పలే!

franchise-films-need-innovation-audience-rejects-repetition

సినిమా బాక్సాఫీస్ వద్ద నిలవాలంటే కథ, కంటెంట్ ఎంత కీలకమో ఇటీవలి కాలంలో స్పష్టమవుతోంది. ముఖ్యంగా భారీ అంచనాలతో వస్తున్న ఫ్రాంచైజీ చిత్రాల విషయంలో ప్రేక్షకులు మరింత పక్కాగా ఉంటున్నారు. కంటెంట్‌లో దమ్ము లేకపోతే, ఎంత పెద్ద స్టార్ ఉన్నా, ఎంత పెద్ద ఫ్రాంచైజీ అయినా నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తున్నారు. థియేటర్లు ఖాళీగా దర్శనమివ్వడమే దీనికి నిదర్శనం.

ఇటీవల విడుదలైన ‘టైగర్ 3’, ‘వార్ 2‘, ‘థామ్’ వంటి స్పై యూనివర్స్, హారర్ కామెడీ ఫ్రాంచైజీ చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడానికి ఇదే ప్రధాన కారణం. గత చిత్రాల ఫార్ములానే నమ్ముకోవడం, కథనంలో కొత్తదనం లోపించడం, హాలీవుడ్ చిత్రాల స్ఫూర్తి కొట్టొచ్చినట్లు కనిపించడం ప్రేక్షకులను నిరాశపరిచింది. విజువల్స్, గ్రాఫిక్స్ నాణ్యత లేకపోవడం కూడా ప్రతికూలంగా మారింది.

ఈ ఫలితాలు “చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం” ఇకపై కుదరదని స్పష్టం చేస్తున్నాయి. ఫ్రాంచైజీ పేరుతో మార్కెటింగ్ చేసుకోవచ్చు గానీ, ప్రేక్షకులు థియేటర్లకు రావాలంటే సినిమాలో విషయం ఉండాల్సిందే. ఎమోషనల్ కనెక్ట్, ఊహించని మలుపులు, తాజాగా అనిపించే కథనం లేకపోతే మొదటి రోజు తర్వాత కలెక్షన్లు పడిపోవడం ఖాయం.

ఈ పరాజయాల నుంచి యష్ రాజ్ ఫిలిమ్స్ (YRF), మడాక్ ఫిలిమ్స్ వంటి పెద్ద సంస్థలు గుణపాఠం నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఫ్రాంచైజీలను కొనసాగించాలంటే, రొటీన్ కథలకు స్వస్తి పలికి, కొత్త ఆలోచనలతో రావాలి. ‘అవతార్’ ఫ్రాంచైజీని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. జేమ్స్ కామెరూన్ ప్రతి సీక్వెల్‌లోనూ కొత్త ప్రపంచాన్ని, కొత్త సంఘర్షణను ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు.

భారతీయ ఫ్రాంచైజీలు కూడా ఇదే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. కేవలం యూనివర్స్ పేరుతో రిపీట్ ఫార్ములాలను రుద్దితే ప్రేక్షకులు ఆదరించరు. కథ, కంటెంట్, భావోద్వేగాలపై దృష్టి పెట్టి, ప్రతి సినిమాను ఓ కొత్త అనుభూతిలా అందిస్తేనే ఫ్రాంచైజీలు మనుగడ సాగిస్తాయి. లేదంటే, ప్రేక్షకుల తిరస్కారం తప్పదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular