
బిగ్ బాస్ 9 కంటెస్టెంట్ ఫ్లోరా షైనీ ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఒక ప్రముఖ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె పెళ్లిపై మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఫ్లోరా మాట్లాడుతూ, “నేను జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నాకు ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడు. అతనితో డీప్‌గా డేటింగ్ చేస్తున్నాను. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే, డేటింగ్ చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేయడం బెటర్ అనిపిస్తోంది” అని తెలిపింది.
తన నిర్ణయానికి కారణంగా స్నేహితుల అనుభవాలను చూపించింది. “నా చుట్టూ ఉన్న వాళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. కానీ కొద్ది ఏళ్లకే విడిపోయారు. వాళ్లను చూసి నాకు భయం వేసింది. అందుకే పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను” అని చెప్పింది.
బిగ్ బాస్ హౌస్‌లో ఎక్కువ కాలం ఉండలేకపోయిన ఫ్లోరా, ఇప్పుడు వరుస ఇంటర్వ్యూలతో తిరిగి లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. తన స్పష్టమైన అభిప్రాయాలతో ప్రేక్షకులలో చర్చనీయాంశంగా నిలుస్తోంది.
