Friday, December 12, 2025
HomeInternationalభారత్‌కు పారిపోయిన హంతకుడు.. న్యూజెర్సీ కేసులో $50 వేల రివార్డ్!

భారత్‌కు పారిపోయిన హంతకుడు.. న్యూజెర్సీ కేసులో $50 వేల రివార్డ్!

న్యూస్ డెస్క్: అమెరికాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో ఎనిమిది ఏళ్ల తర్వాత నిందితుడి కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) గాలిస్తోంది. 2017లో న్యూజెర్సీలో భారతీయ మహిళ శశికళ నర్రా ఆమె కుమారుడు అనీష్ నర్రా హత్య కేసులో ప్రమేయం ఉన్న నజీర్ హమీద్ గురించి సమాచారం ఇచ్చిన వారికి $50,000 (సుమారు రూ. 45 లక్షలు) రివార్డును ఇస్తామని ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శశికళ అనీష్ నర్రాలను హత్య చేసిన కేసులో నజీర్ హమీద్ (38) పై ఈ ఏడాది ఫిబ్రవరిలో రెండు ఫస్ట్ డిగ్రీ మర్డర్ కేసులు పెట్టారు. హమీద్ హత్య జరిగిన ఆరు నెలల్లోనే భారత్‌కు పారిపోయినట్లు అమెరికా అధికారులు అనుమానిస్తున్నారు.

మొదట్లో బాధితురాలి భర్త హనుమంతరావు నర్రాను కూడా అనుమానించారు. ఆయన అక్రమ సంబంధం ఆరోపణలు రావడంతో డీఎన్ఏ టెస్ట్ చేయగా, అందులో హనుమంతరావు ప్రమేయం లేదని తేలింది.

హనుమంతరావు సహోద్యోగి అయిన హమీద్‌తో ఆయనకు గొడవలు ఉండడంతో, హమీద్ భార్య కొడుకును హత్య చేసినట్లు పోలీసులు తేల్చారు. హమీద్ ల్యాప్‌టాప్ నుండి సేకరించిన డీఎన్ఏ హత్య జరిగిన ప్రాంతంలోని డీఎన్ఏతో సరిపోలడంతో ఈ విషయం నిర్ధారణ అయ్యింది.

హత్య తర్వాత భారత్‌కు పారిపోయిన హమీద్ అరెస్ట్‌కు అమెరికా అధికారులు వారెంట్ జారీ చేశారు. హమీద్‌ను అప్పగించాలని భారత్ ప్రభుత్వాన్ని అమెరికా అధికారులు కోరారు.

భారత చట్టం, ద్వైపాక్షిక ఒప్పందాల నిబంధనలకు అనుగుణంగా అప్పగింత ప్రక్రియ సులభతరం చేయడానికి భారత్ సహకరించాలని న్యూజెర్సీ కోరుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular