Sunday, October 4, 2026
HomeMovie News'ఫ్యామిలీ మ్యాన్ 3' కొత్త పోస్టర్.. ఈసారి శ్రీకాంత్ తివారీ టార్గెట్!

‘ఫ్యామిలీ మ్యాన్ 3’ కొత్త పోస్టర్.. ఈసారి శ్రీకాంత్ తివారీ టార్గెట్!

family-man-3-new-poster-manoj-bajpayee-target

వెబ్ సిరీస్‌లకు ఇండియాలో క్రేజ్ తెచ్చిన ఘనత ‘ది ఫ్యామిలీ మ్యాన్‘ సిరీస్‌కే దక్కుతుంది. రాజ్ & డీకే దర్శకత్వంలో, మనోజ్ బాజ్‌పేయి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్ రెండు సీజన్లూ బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌గా నిలిచాయి. ఇప్పుడు, మోస్ట్ అవైటెడ్ మూడో సీజన్ విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో, మేకర్స్ విడుదల చేసిన ఓ కొత్త పోస్టర్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఈ పోస్టర్‌లో, శ్రీకాంత్ తివారీ (మనోజ్ బాజ్‌పేయి), అతని టీమ్ మేట్‌ను ఎవరో కిడ్నాప్ చేసి, టార్గెట్ చేసినట్లు చూపించారు.

ఈసారి శ్రీకాంత్ తివారీ ఎవరిని ఎదుర్కోబోతున్నాడు? అతన్ని, అతని టీమ్‌ను ఎందుకు టార్గెట్ చేశారు? అనే అంశాలు సిరీస్‌పై ఉత్కంఠను పెంచుతున్నాయి. ఒకవైపు ఫ్యామిలీ మ్యాన్‌గా, మరోవైపు సీక్రెట్ ఏజెంట్‌గా మనోజ్ బాజ్‌పేయి నటన మరోసారి హైలైట్ కానుంది.

ఈ సీజన్‌లో ప్రియమణి, షరీబ్ హష్మి, శ్రేయా ధన్వంతరి వంటి పాత తారాగణంతో పాటు, కొత్తగా జైదీప్ అహ్లావత్, నిమ్రత్ కౌర్ వంటి ప్రతిభావంతులైన నటులు కూడా జాయిన్ అవుతున్నారు.

రాజ్ & డీకే బ్రాండ్, పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సీజన్‌ను మరింత థ్రిల్లింగ్‌గా మలిచినట్లు తెలుస్తోంది. ‘ఫ్యామిలీ మ్యాన్ 3’ మరోసారి ఓటీటీ రికార్డులను బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular