Friday, August 14, 2026
HomeNationalదేశానికి టెర్రరిజం ముప్పు.. ఢిల్లీ పేలుళ్ల వెనుక వైద్యుల నెట్‌వర్క్!

దేశానికి టెర్రరిజం ముప్పు.. ఢిల్లీ పేలుళ్ల వెనుక వైద్యుల నెట్‌వర్క్!

doctor-terrorism-network-behind-delhi-red-fort-blast

ఢిల్లీ: ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు (9 మంది మృతి) దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటన దర్యాప్తులో “డాక్టర్ టెర్రరిజం” అనే భయానక కోణం వెలుగులోకి వచ్చింది. ఉన్నత విద్యావంతులైన వైద్యులే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నట్లు ఆధారాలు లభిస్తున్నాయి.

ఈ పేలుడులో ప్రధాన సూత్రధారిగా పుల్వామాకు చెందిన డాక్టర్ ఉమర్ మహ్మద్‌పై నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఫరీదాబాద్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసిన ఇతను, జమ్మూ కశ్మీర్ ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధాలు కలిగి ఉండి, పేలుడుకు ప్లాన్ చేసినట్లు భావిస్తున్నారు.

ఢిల్లీ పేలుడుకు ముందే ఫరీదాబాద్‌లో, జైషే మహ్మద్ (JeM) ఉగ్రవాదులు ఏడుగురిని అరెస్ట్ చేయగా, వారిలో ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. వారి నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. గత 48 గంటల్లో ఐదుగురు వైద్యులు ఈ నెట్‌వర్క్‌లో ఉన్నట్లు తేలింది.

ఈ నెట్‌వర్క్‌లో మహిళా డాక్టర్లు కూడా క్రియాశీలంగా ఉన్నారు. లఖ్‌నవూకు చెందిన డాక్టర్ షాహీన్ షాహిద్, జైషే మహ్మద్ మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మరో మహిళా వైద్యురాలు డాక్టర్ పర్వేజ్ అన్సారీని కూడా అరెస్టు చేశారు.

‘ఆపరేషన్ సిందూర్’తో ఉగ్ర నాయకత్వం దెబ్బతినడంతో, ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు వైద్యుల వంటి విద్యావంతులను నియమించుకుంటున్నాయి. ప్రాణాలు పోయాల్సిన వైద్యులే మరణ మిషన్లలో భాగం కావడం దేశ భద్రతకు కొత్త సవాల్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular