
ఒకప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్‌గా పాపులారిటీ ఉన్న శంకర్.. ఈ మధ్య ఫామ్‌లో లేరని తెలుస్తుంది. ఆయన తొలి తెలుగు స్ట్రైట్ సినిమా గేమ్ ఛేంజర్ అంచనాలకు తగ్గట్టు ఆడకపోవడంతో, తర్వాత ప్రాజెక్ట్‌పై గ్యాప్ తీసుకున్నారు.
శంకర్ ఇప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ వేల్పారిని భారీ ప్లానింగ్‌తో సిద్ధం చేస్తున్నారు. ఒకప్పుడు ఆయనతో సినిమా చేయడానికి నిర్మాతలు హీరోలు క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు రజనీకాంత్ కమల్ హాసన్ వంటి స్టార్లు బిజీగా ఉండటం వల్ల పరిస్థితి మారింది.
దీంతో శంకర్ దృష్టి యంగ్ స్టార్స్ వైపు మళ్లింది. వీజే నుంచి స్టార్‌గా ఎదిగిన శివ కార్తికేయన్‌తో పాటు సూర్య ధనుష్ పేర్లను పరిశీలిస్తున్నట్లు కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.
శివ కార్తికేయన్‌తో అయితే ప్రాజెక్ట్ అదిరిపోతుందని శంకర్ భావిస్తున్నారట. శంకర్ లాంటి డైరెక్టర్‌తో సినిమా అంటే శివ కార్తికేయన్ నో చెప్పే ఛాన్స్ లేదు.
తమిళ్ తెలుగుతో పాటు మిగతా సౌత్ ఆడియన్స్ కి పరిచయం ఉన్న స్టార్స్ అయితే బిజినెస్ కూడా ఎక్కువ రీచ్ ఉంటుందని శంకర్ భావిస్తున్నారు. త్వరలోనే వేల్పారి హీరోపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
