Tuesday, December 16, 2025
HomeMovie Newsఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మారుతి క్షమాపణలు.. వివాదంకు ఫుల్ స్టాప్!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మారుతి క్షమాపణలు.. వివాదంకు ఫుల్ స్టాప్!

director-maruthi-apologizes-ntr-fans-collar-controversy-raja-saab-event

చిన్న మాట సోషల్ మీడియాలో పెద్ద వివాదంగా మారుతుందనడానికి ఇదే ఉదాహరణ. ‘ది రాజా సాబ్’ ఈవెంట్ లో దర్శకుడు మారుతి మాట్లాడిన కొన్ని మాటలు ఎన్టీఆర్ అభిమానులను తీవ్రంగా నొప్పించాయి.

“నేను కాలర్ ఎగరేసుకోమని చెప్పను.. ప్రభాస్ కటౌట్‌కు అది చాలా చిన్న మాట” అని మారుతి అనడం, ఇది తరచూ “కాలర్ ఎగరేసుకునే సినిమా ఇస్తా” అని చెప్పే ఎన్టీఆర్‌ను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఫ్యాన్స్ భావించారు.

పరిస్థితి ముదరకముందే దర్శకుడు మారుతి వెంటనే స్పందించారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు. తాను ఎవరినీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ మాటలు అనలేదని, కేవలం ఫ్లోలో వచ్చిన మాటలే అని వివరణ ఇచ్చారు.

జరిగిన దానికి ఎవరైనా హర్ట్ అయి ఉంటే వారికి మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నానని మారుతి హుందాగా స్పందించారు. ఎన్టీఆర్ గారంటే తనకు ఎంతో గౌరవమని, దయచేసి తన మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దని ఆయన కోరారు.

నిజానికి మారుతికి, ఎన్టీఆర్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈవెంట్ హడావిడిలో చెప్పిన మాటలను నెటిజన్లు తప్పుగా అర్థం చేసుకోవడంతోనే ఈ గొడవ అనవసరంగా పెద్దదైంది.

వివాదం పెద్దది కాకముందే స్పందించి, బహిరంగంగా క్షమాపణలు చెప్పడం ద్వారా మారుతి తన మంచి మనసును చాటుకున్నారు. ఈ క్లారిటీతో ఈ ‘కాలర్’ వివాదానికి తెరపడినట్లే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular