
న్యూస్ డెస్క్: బిగ్ బాస్ సీజన్ 9లో ఈ వారం హోస్ట్ నాగార్జున డబల్ ఎలిమినేషన్‌తో హౌస్ మేట్స్‌కు షాక్ ఇచ్చారు. శనివారం ఎపిసోడ్‌లో సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిన తర్వాత, రెండో ఎలిమినేషన్ ఎవరు అనే ఆసక్తి ప్రేక్షకుల్లో పెరిగింది.
గత వారం కళ్యాణ్ మినహా అందరూ నామినేషన్స్‌లో ఉండగా, లీస్ట్ ఓటింగ్ కారణంగా నిన్న సుమన్ శెట్టిని బయటకు పంపించారు. డబల్ ఎలిమినేషన్‌లో భాగంగా మిగిలిన ఆరుగురిలో బలమైన పోటీ ఉన్నప్పటికీ, సంజన భరణి లీస్ట్ లో ఉన్నారు.
సీజన్ 9లో ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా భరణి మళ్లీ ఎలిమినేట్ అవుతున్నాడు. భరణి ఇప్పటికే ఒకసారి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఆడియన్స్ డిమాండ్‌తో శ్రీజ భరణి ఇద్దరిని హౌస్‌లోకి పంపించి, ఓటింగ్ పోల్‌తో భరణిని కొనసాగించారు.
భరణి రీ ఎంట్రీ తర్వాత ఫన్ యాంగిల్ చూపించాడు. ఫైనల్ వీక్ వరకు ఉంటాడని అతని ఫ్యాన్స్ ఆశించినప్పటికీ, అతను ఇప్పటికే ఒకసారి బయటకు వెళ్లి వచ్చాడు కాబట్టి, సంజనాని టాప్ 5కి పంపించడమే కరెక్ట్ అని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
శనివారం ఎపిసోడ్‌లోనే సుమన్ భరణి ఫ్రెండ్‌షిప్‌పై ఒక ప్రత్యేక సాంగ్ వేసి వీడియో చూపించడం ద్వారా బిగ్ బాస్, సుమన్‌తో పాటు భరణి కూడా ఎలిమినేట్ అవుతున్నట్లు హింట్ ఇచ్చారనే చర్చ నడుస్తోంది. గత మూడు వారాల నుంచి భరణి బాగానే ఆడినప్పటికీ, ఈ వారం డబల్ ఎలిమినేషన్‌లో అతను మరోసారి ఎలిమినేట్ అవుతున్నాడు.
