Sunday, October 4, 2026
HomeSportsచరిత్రలో తొలిసారి.. వైట్ వాష్‌తో గంభీర్, అగార్కర్‌కు బీసీసీఐ క్లాస్!

చరిత్రలో తొలిసారి.. వైట్ వాష్‌తో గంభీర్, అగార్కర్‌కు బీసీసీఐ క్లాస్!

bcci-emergency-meeting-gautam-gambhir-ajit-agarkar-test-whitewash-india

న్యూస్ డెస్క్: టెస్టు ఫార్మాట్‌లో ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండు వైట్‌వాష్‌లు (న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలపై).. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా టీమ్ ఇండియాపై పడిన చెత్త రికార్డ్. ఈ దారుణ ప్రదర్శనపై బీసీసీఐ (BCCI) సీరియస్ అయ్యింది.

టీమ్ ఇండియా చీఫ్ సెలక్టర్‌ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లతో బీసీసీఐ ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. సాధారణంగా ముంబైలో జరిగే సమావేశం.. రెండో వన్డే జరగనున్న రాయ్ పూర్ లో అత్యవసరంగా నిర్వహించనున్నారు.

గత ఏడాది శ్రీలంక చేతిలో 27 ఏళ్ల తర్వాత వన్డే సిరీస్ పరాజయం, టెస్టుల నుంచి ముగ్గురు దిగ్గజాలు అనూహ్య రిటైర్మెంట్ ప్రకటించడం.. ఇవన్నీ బోర్డును ఆందోళనకు గురి చేశాయి. అందుకే ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.

గంభీర్ అగార్కర్‌లు వచ్చాక టీమిండియా తీసుకుంటున్న నిర్ణయాలు సాధారణ జట్టులా ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. ‘ఏం చేస్తున్నారు మీరు?’ అంటూ బీసీసీఐ వీరిని సున్నితంగా ప్రశ్నించే అవకాశం ఉంది.

వచ్చే ఫిబ్రవరిలో టీ20 ప్రపంచకప్, వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ ఉన్నాయి. టీ20 ప్రపంచకప్‌ను నిలబెట్టుకోవడం వన్డే ప్రపంచకప్ నెగ్గడం చాలా ప్రతిష్ఠాత్మకం.

అందుకనే గంభీర్ అగార్కర్‌ల నుంచి వారి ప్రణాళికలపై బీసీసీఐ స్పష్టత కోరనుంది. ఈ సమావేశం అనంతరం ఎలాంటి మార్పులు ఉంటాయి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular