Friday, December 12, 2025
HomeMovie Newsఅన్నయ్య.. తమ్ముడు.. శివరాజ్ కుమార్‌తో బాలయ్య బాండింగ్!

అన్నయ్య.. తమ్ముడు.. శివరాజ్ కుమార్‌తో బాలయ్య బాండింగ్!

balakrishna-shiva-rajkumar-brother-veera-simha-reddy-mufti-inspiration

బాలకృష్ణ ప్రసంగం అంటే ముందుగా నందమూరి తారక రామారావు, ఏఎన్నార్ పేర్లే వినిపిస్తాయి. ఆయన శైలిలో మరొకరిని పొగడటం చాలా అరుదు. అలాంటిది బాలయ్య నోట పరభాష నటుడి పేరు రావడమే కాదు, ఏకంగా ఆయన్ను తమ్ముడు అనడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

అఖండ 2 ప్రమోషన్స్ సందర్భంగా కర్ణాటకలో బాలయ్య.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్‌ను “తమ్ముడు” అంటూ సంబోధించారు. అంతేకాదు, తన సినిమా వీర సింహా రెడ్డి లోని లుక్‌కు స్ఫూర్తి శివరాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం మప్టీ అని స్వయంగా వెల్లడించారు.

తెలుగులో ఇతర స్టార్ల సినిమాల గురించి కూడా మాట్లాడని బాలయ్య, కన్నడ నటుడి నుంచి స్ఫూర్తి పొందానని చెప్పడం ఆసక్తికరం. ఇది వారి మధ్య ఉన్న సోదరభావానికి నిదర్శనం. ఇలా ఇచ్చిపుచ్చుకోవడం తమకు అలవాటేనని బాలయ్య అన్నారు.

బాలయ్య మాటలకు శివరాజ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. బాలయ్య తన సోదర సమానులని చెప్పారు. వీరిద్దరి మధ్య ఉన్న ఈ బాండింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హైలైట్ అయ్యింది.

శివరాజ్ కుమార్ కోరిక మేరకు.. అఖండ 2 గనుక విజయం సాధిస్తే, ఆ సక్సెస్ మీట్‌ను కూడా కర్ణాటకలోనే గ్రాండ్‌గా నిర్వహిస్తామని బాలయ్య హామీ ఇచ్చినట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular