
టాలీవుడ్‌లో చాలామంది సీనియర్ హీరోయిన్లు తిరిగి వెండితెరపై కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ, అందరికీ అదృష్టం కలిసి రాలేదు. ఇటీవలి కాలంలో అన్షు, లయ, జెనీలియా తల్లి పాత్రలతో రీ-ఎంట్రీ ఇచ్చారు.
మన్మథుడు ఫేమ్ అన్షు “మజాకా”తో ప్రేక్షకుల ముందుకొచ్చినా, ఫలితం ఆశించినదిలా రాలేదు.
లయ “తమ్ముడు” సినిమా ద్వారా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా, అదే పరిస్థితి ఎదురైంది.
ఇక బొమ్మరిల్లు జెనీలియా “జూనియర్” సినిమాతో మళ్లీ టాలీవుడ్‌లో కనిపించింది. కానీ, ఆమెకు పెద్దగా గుర్తింపు దక్కలేదు.
ఇలా ఈ ముగ్గురు భామలు మంచి కెరీర్‌ను ఆశించగా, రీ ఎంట్రీ మాత్రం కలిసిరాలేదు. సినిమాల ఫలితాల వల్ల మళ్లీ అవకాశాలు వస్తాయో లేదో చూడాలి. మరి వీరి కథ తిరిగి మారుతుందా అనేది ఆసక్తికరమైన విషయం.
