
దర్శకధీరుడు రాజమౌళి భారతీయ సినిమాలో మరో కొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు. ‘బాహుబలి‘ రెండు భాగాలను కలిపి, ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో సింగిల్ వెర్షన్‌గా రీ-రిలీజ్ చేయడం సంచలనం సృష్టిస్తోంది. పదేళ్లయినా ఈ చిత్రానికి ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని, ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ నిరూపిస్తోంది.
‘బాహుబలి: ది ఎపిక్’ అనూహ్య విజయం ఇప్పుడు ఇతర పాన్-ఇండియా ఫ్రాంచైజీల నిర్మాతలను ఆలోచనలో పడేసింది. రాజమౌళి ఫార్ములాను ఫాలో అయ్యేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. ముఖ్యంగా, ‘పుష్ప’, ‘కేజీఎఫ్’, ‘కాంతార’ మేకర్స్ ఈ జాబితాలో ముందున్నట్లు తెలుస్తోంది.
ఈ మూడు చిత్రాలు కూడా రెండు భాగాలుగా విడుదలై, దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. వీటికి కూడా ‘బాహుబలి’ స్థాయిలోనే ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే, వీటిని కూడా ఒకే సినిమాగా ఎడిట్ చేసి విడుదల చేస్తే, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘పుష్ప’ టీమ్ ఇప్పటికే మూడో భాగం (‘పుష్ప: ది ర్యాంపేజ్’)ను ప్రకటించింది. బహుశా ఈ సిరీస్ పూర్తయిన తర్వాత, మూడు భాగాలను కలిపి ఒకే “పుష్ప సాగా”గా విడుదల చేసే అవకాశం ఉంది.
అదేవిధంగా, ‘కేజీఎఫ్’, ‘కాంతార’ చిత్రాల మేకర్స్ కూడా తమ సిరీస్‌లను సింగిల్ “ఎపిక్” వెర్షన్లుగా తీసుకురావడంపై యోచిస్తున్నారట.
రాజమౌళి ప్రారంభించిన ఈ “సింగిల్ వెర్షన్ రీ-రిలీజ్” ట్రెండ్‌ను ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి. ఇది కేవలం దక్షిణాదికే పరిమితం కాకుండా, బాలీవుడ్ మేకర్స్ కూడా ఈ ఫార్ములాపై దృష్టి సారించినట్లు సమాచారం.
