
న్యూస్ డెస్క్: సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా యూస్ చేయకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఒక సంచలన చట్టం తీసుకువచ్చింది.
ఈ కొత్త చట్టం అమలు చేయడం ప్రారంభించిన తర్వాత.. ఎంతమంది పిల్లలు తమ ఖాతాలను మూసివేస్తున్నారో నెలవారీగా నివేదించాలని ఆస్ట్రేలియా మంత్రి తెలిపారు. దీనివల్ల పిల్లలు తమ కెరియర్ ను తప్పుదోవ పట్టించుకోకుండా ఉంటారని భావిస్తున్నారు.
పదహారేళ్ల లోపు ఆస్ట్రేలియన్ పిల్లలు తమ సోషల్ మీడియా ఖాతాలను తొలగించడానికి సహేతుకమైన చర్యలు తీసుకోవడంలో ఫ్లాట్‌ఫామ్‌లు విఫలమైతే, డిసెంబర్ 10 నుండి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టిక్ టాక్, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫార్మ్స్‌కి 50 మిలియన్ల వరకు ఆస్ట్రేలియన్ డాలర్ జరిమానా విధించబడుతుందని తెలిపారు.
ఈ ఫ్లాట్‌ఫామ్‌లు పదేపదే రూల్స్ ను అతిక్రమిస్తే, కోర్టు గరిష్టంగా జరిమానా విధించవచ్చని eSafety నియంత్రణ సంస్థ తెలిపింది. మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్) అనుమానిత చిన్నపిల్లలను గురువారం నుండి ఆ ఫ్లాట్‌ఫారం నుండి తొలగిస్తామని తెలిపింది.
అయితే వయసును కచ్చితంగా నిర్ధారించడానికి సమయం పడుతుందని కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వేల్స్ తెలిపారు. ఈ చట్టం ప్లాట్‌ఫార్మ్‌ను తప్పుగా అర్థం చేసుకుంటుందని, పిల్లలను ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉంచాలనే లక్ష్యాన్ని నెరవేర్చలేదని గూగుల్ ఓ ప్రకటనలో తెలిపింది.
మలేషియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్ వంటి ఇతర దేశాలు కూడా సోషల్ మీడియాకు కనీస వయసు నిర్ణయించడానికి ఆసక్తిగా ఉన్నాయని మంత్రి వెల్స్ తెలిపారు. ఈ చట్టాన్ని ఇండియాలో కూడా తీసుకువస్తే బాగుంటుందని చాలామంది పేరెంట్స్ అభిప్రాయపడుతున్నారు.
