
న్యూస్ డెస్క్: ఆసియా కప్ 2025 కోసం భారత క్రికెట్ జట్టు ఎంపిక పూర్తయింది. బీసీసీఐ ప్రధాన సెలెక్టర్ అజిత్ ఆగార్కర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో జట్టు జాబితాను ప్రకటించారు. ఈ సారి సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు.
జట్టులో జస్ప్రీత్ బుమ్రా తిరిగి వచ్చి బౌలింగ్ విభాగానికి బలాన్ని ఇచ్చాడు. కానీ శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్‌లకు మాత్రం స్థానం దక్కలేదు. అభిమానులు వీరిద్దరూ ఖచ్చితంగా ఉంటారని ఆశించినా, సెలెక్టర్లు ఫామ్ మరియు ఫిట్‌నెస్ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బ్యాటింగ్ విభాగంలో శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మలు ఉన్నారు. ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే కీలక పాత్ర పోషించనున్నారు. మిడిల్ ఆర్డర్‌లో రింకు సింగ్‌కు ఈ సారి ఫినిషర్ బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.
స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఉన్నారు. వికెట్ కీపర్లుగా సంజూ శాంసన్, జితేష్ శర్మలను ఎంపిక చేశారు. వీరిద్దరికీ మ్యాచ్ పరిస్థితుల ఆధారంగా అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు.
మొత్తం మీద యువ ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇస్తూ, అనుభవజ్ఞుల సమతుల్య కూర్పుతో జట్టును ఎంపిక చేశారు. భారత్ లీగ్, సూపర్ 4తో కలిపి ఆరు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో పాకిస్థాన్‌తో జరిగే పోరు హై వోల్టేజ్ బాటిల్‌గా మారనుంది.
టీమిండియా జట్టు: సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (VC), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ సింగ్ రాణా
