Monday, April 20, 2026
HomeBusinessఆపిల్ - శాంసంగ్ మధ్య సైలెంట్ వార్.. సెటైర్లే కారణమా?

ఆపిల్ – శాంసంగ్ మధ్య సైలెంట్ వార్.. సెటైర్లే కారణమా?

apple-vs-samsung-silent-war-on-social-media

న్యూస్ డెస్క్: టెక్ రంగంలో పోటీ సాధారణమే. కానీ ఆ పోటీ సోషల్ మీడియాలో సెటైర్ల రూపంలోకి మారితే చర్చ తప్పదని చెప్పాలి. తాజాగా ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ విడుదల చేయగానే శాంసంగ్ వరుస పోస్టులతో ఇన్‌డైరెక్ట్‌గా ఎగతాళి చేస్తూ హాట్ టాపిక్ అయ్యింది.

ఆపిల్ కొత్త ఐఫోన్ 17, ఎయిర్, ప్రో, ప్రో మాక్స్ మోడల్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్, స్మార్ట్‌వాచ్‌లను కూడా లాంచ్ చేసింది. ఈ సందర్భంగా “మొదటి సారిగా సన్నని ఫోన్” అని వ్యాఖ్యానించడం శాంసంగ్‌కు టార్గెట్ అయ్యింది. శాంసంగ్ “ఇంతకు ముందు చిన్న మోడల్స్ చాలానే వచ్చాయి” అంటూ వ్యంగ్యం చేసింది.

అంతకుముందే, 2022లో ఫోల్డబుల్ ఫోన్లపై సెటైర్ వేసిన శాంసంగ్, మళ్లీ అదే విషయాన్ని గుర్తు చేసింది. ఇప్పటికీ ఆపిల్ ఫోల్డబుల్ మోడల్ ఇవ్వలేదని చెప్పి #iCant హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు చేసింది. కెమెరా విషయంలో కూడా “48MP మూడు సార్లు వచ్చినా 200MPకి సరిపోదు” అని చురకలు వేసింది.

అలాగే ఆపిల్ పరిచయం చేసిన లైవ్ ట్రాన్స్లేషన్, స్లీప్ స్కోర్ ఫీచర్లను ఉద్దేశించి “ఇవి ఐదేళ్లు ఆలస్యంగా వచ్చాయి” అని మరోసారి ఎగతాళి చేసింది. దీంతో నెటిజన్లు ఈ రెండింటి మధ్య పోటీ నిజంగా యుద్ధంలా మారిందని కామెంట్ చేస్తున్నారు.

మొత్తంగా చూస్తే, ఆపిల్ – శాంసంగ్ పోటీ ఇప్పుడు కేవలం టెక్నాలజీ పరంగా కాకుండా సోషల్ మీడియాలో కూడా రగులుతోంది. ఇది టెక్ అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular