Friday, January 16, 2026
HomeMovie Newsపూరి తర్వాత ఆ రికార్డు అనిల్ రావిపూడిదే..

పూరి తర్వాత ఆ రికార్డు అనిల్ రావిపూడిదే..

anilk-ravipudi-puri-jaganadh-fastest-director-tollywood-release-strategy

న్యూస్ డెస్క్: టాలీవుడ్‌లో అత్యంత వేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ చేసిన ఘనత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ది. ఆయన డిక్షనరీలో రెండు మూడు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆర్టిస్టుల టైమ్‌ను ఎక్కువగా తీసుకోకుండా, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా డీల్ చేయగలగడం పూరి ప్రత్యేకత.

పూరి జగన్నాధ్ తర్వాత అదే వేగంతో సినిమాలు తీయగల దర్శకుడు అనిల్ రావిపూడి అని చెప్పవచ్చు. ప్రారంభోత్సవం అనంతరం పెద్దగా సమయం తీసుకోకుండా, ఆర్టిస్టుల డేట్లను బట్టి షూటింగ్‌ను చకచకా పూర్తి చేస్తారు. అదనంగా డేట్లు తీసుకుని నిర్మాతపై భారం వేయకుండా, ఖర్చు విషయంలోనూ జాగ్రత్త పడతారు.

అనిల్ రావిపూడి 15 ఏళ్ల కెరీర్‌లో ఎనిమిది సినిమాలు చేసి, వాటి రిలీజ్ విషయంలో ఎక్కడా జాప్యం జరగలేదు. పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఆలస్యం జరగకుండా తెలివిగా ప్లాన్ చేసుకుంటారు. షూటింగ్ పూర్తి చేసిన చిత్రాన్ని అంతే వేగంగా రిలీజ్ చేయగల సమర్థుడు.

సినిమాకు ప్రచారం (పబ్లిసిటీ) విషయంలో కూడా అనిల్ చాలా స్మార్ట్‌గా వ్యవహరిస్తారు. ప్రచారం కోసం నిర్మాతకు కోట్లు ఖర్చు చేయించకుండా, సినిమాలో నటీనటులనే తెలివిగా వినియోగించుకుంటారు. సందర్భాన్ని బట్టి రకరకాల వ్యూహాలు వేసి నిర్మాతకు కోట్లు ఆదా చేయగల దర్శకుడు.

ఉదాహరణకు, ‘మ‌న శంవ‌క‌ర ప్ర‌సాద్ గారు’ సినిమాలో ప్రచారానికి దూరంగా ఉండే నయనతారను కూడా ఒప్పించి పని చేయించారు. సినిమా ప్రారంభానికి ముందే ప్రీ-లాంచ్ ప్రమోషన్ ప్లానింగ్‌తో పాటు, చిరంజీవి నయనతార లాంటి స్టార్లనే రంగంలోకి దింపి ప్రచారం చేయించడం ఆయన ప్లానింగ్‌కు నిదర్శనం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular