
టాలీవుడ్‌లో 100% సక్సెస్ రేటు ఉన్న దర్శకుడంటే రాజమౌళి తర్వాత వినిపించే పేరు అనిల్ రావిపూడి. ‘పటాస్’ నుంచి మొదలుకొని ‘భగవంత్ కేసరి’, ‘సంక్రాంతి వస్తున్నాం’ వరకు ఆయన ఫ్లాప్ ఎరుగరు. ముఖ్యంగా ‘F-2’, ‘సరిలేరు నీకెవ్వరు’ వంటి చిత్రాలతో ఆయన “సంక్రాంతి డైరెక్టర్” అనే బిరుదును సార్ధకం చేసుకున్నారు.
ఈ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ, 2026 సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అంటూ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో రానున్నారు. ఆయన ట్రాక్ రికార్డ్ చూసి, ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని అభిమానులు ధీమాగా ఉన్నారు.
అయితే, గతంలో మాదిరిగా ఈసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడక కాదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈసారి ఆయనకు తీవ్రమైన పోటీ ఎదురుకానుంది.
గతంలో 2019లో ‘F-2’ విడుదలైనప్పుడు, పండగకు వచ్చిన ఏకైక ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అదే. అలాగే, 2025లో ‘సంక్రాంతి వస్తున్నాం’ కూడా యాక్షన్ చిత్రాల నడుమ విడుదలై, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏకపక్షంగా ఆకట్టుకుంది. ఈ ఫార్ములా ఆయనకు బాగా కలిసొచ్చింది.
కానీ, 2026 సంక్రాంతి బరి చాలా భిన్నంగా ఉంది. చిరంజీవి సినిమాతో పాటు, ప్రభాస్ నటిస్తున్న ‘ది రాజా సాబ్’, నవీన్ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు కూడా పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్లే. ఈ రెండు చిత్రాలపైనా ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్ ఉంది.
దీంతో, ఈసారి ఫ్యామిలీ ఓట్లు గట్టిగా చీలిపోయే అవకాశం ఉంది. ఈ త్రిముఖ పోటీలో నిలబడి, తన కామెడీ మార్క్‌తో అనిల్ రావిపూడి తన 100% సక్సెస్ రేటును నిలబెట్టుకుంటారా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
