
న్యూస్ డెస్క్: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ‘ద గోట్ ఇండియా టూర్’లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో అభిమానులకు అభివాదం చేశారు. ఈ అరుదైన క్షణంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత ఫడ్నవీస్ వ్యవహారశైలిపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మెస్సీతో ఆమె వేదిక పంచుకున్న తీరు సరిగా లేదని నెటిజన్లు ఫైరవుతున్నారు. వైరల్ అవుతోన్న వీడియో ప్రకారం:
- మైదానంలో ఉన్న మెస్సీ వద్దకు అమృత ఫడ్నవీస్ వెళ్లింది. ఈ సమయంలో ఆమె చూయింగ్ గమ్ నములుతూ, మెస్సీని సరిగ్గా గ్రీట్ చేయకుండా సెల్ఫీలు తీసుకున్నారు.
- ఆమె ప్రవర్తన ఆటిట్యూడ్ చూపిస్తున్నట్లుగా ఉందని, దేశానికి వచ్చిన ప్రపంచ స్థాయి దిగ్గజంతో అలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
- సెల్ఫీకి వెళ్లిన సమయంలో మెస్సీ కాస్త అసౌకర్యంగా కనిపించాడని, ఆమె ఒకటి రెండుసార్లు సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేసి అతడిని ఇబ్బంది పెట్టారని కామెంట్లు పెడుతున్నారు.
- మరో ఫుట్‌బాల్ క్రీడాకారుడు లూయిస్ సువారెజ్ ను దాటి, అనుమతి లేకుండా మెస్సీ దగ్గరకు వెళ్లడం ఆమోదయోగ్యం కాదని రాసుకొస్తున్నారు.
అదే విధంగా, మెస్సీ చిరకాల స్నేహితులు లూయిస్ సువారెజ్ రోడ్రిగో డీ పాల్ ను పక్కన పెట్టి, కేవలం మెస్సీతోనే సెల్ఫీలు తీసుకోవడం సరైంది కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. “మీ వైఖరి చూస్తుంటే.. మెస్సీ మీతో ఫోటో తీయించుకోవడానికి వచ్చినట్లు కనిపిస్తోంది” అంటూ ఒక ఎక్స్ యూజర్ కామెంట్ చేశారు.
