Friday, September 4, 2026
HomeMovie Newsత్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో.. రాజమౌళిని మించేలా!

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో.. రాజమౌళిని మించేలా!

ALLU-ARJUN-TRIVIKRAM-COMBO-TO-CROSS-RAJAMOULI
ALLU-ARJUN-TRIVIKRAM-COMBO-TO-CROSS-RAJAMOULI

మూవీడెస్క్: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన మోస్ట్ అవైటెడ్ మూవీ ‘పుష్ప 2’తో డిసెంబర్ 5న థియేటర్స్ లో సందడి చేయబోతున్నాడు.

ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి భారీ పాన్ ఇండియా సినిమాని చేయబోతున్నాడు.

ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది.

తాజాగా నిర్మాత నాగవంశీ ఇచ్చిన హింట్ ప్రకారం, త్రివిక్రమ్, బన్నీ కాంబో సినిమా ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని జోనర్‌లో ఉండబోతోందని సమాచారం.

‘గుంటూరు కారం’ డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ పూర్తిగా ఈ ప్రాజెక్ట్ పైనే ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో త్రివిక్రమ్ రాజమౌళి టచ్ చేయని కొత్త పంథాలో కథని రాస్తున్నాడని, సినిమా విజువల్స్ కూడా నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని చెప్పారు.

మార్చి నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుండగా, ‘పుష్ప 2’ తర్వాత అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుందని నాగవంశీ కన్‌ఫర్మ్ చేశారు.

ఫ్యాన్స్ ఈ కాంబినేషన్ నుంచి బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

త్రివిక్రమ్ రాబోయే ఈ ప్రాజెక్ట్ లో క్రియేట్ చేయబోతున్న వరల్డ్.. ఆయన దృష్టిలో రాజమౌళి స్థాయిని మించేలా ఉండనుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular

MalCare WordPress Security Plugin - Malware Scanner, Cleaner, Security Firewall Firewall

Blocked because of Malicious Activities

Reference ID: 9429787026a9b1f9850c43