Sunday, August 16, 2026
HomeMovie Newsఅల్లరి నరేష్ సెటైర్స్.. ఛాన్స్ వస్తే చాలు జంప్ అవుతారా?

అల్లరి నరేష్ సెటైర్స్.. ఛాన్స్ వస్తే చాలు జంప్ అవుతారా?

allari-naresh-comments-on-telugu-actresses-kamakshi-bhaskarla

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు అనే కంప్లైంట్ ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఒకసారి ఫేమ్ వచ్చాక వాళ్లు చేసే పనేంటో హీరో అల్లరి నరేష్ ఓపెన్‌గా మాట్లాడారు. తాజాగా జరిగిన ’12A రైల్వే కాలనీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

నాని కాసర గడ్డ దర్శకత్వంలో నరేష్ నటించిన ఈ సినిమా నవంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఇందులో అచ్చ తెలుగమ్మాయి కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. ఈ సందర్భంగా నరేష్ ఆమె డెడికేషన్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘పొలిమేర’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కామాక్షి, వృత్తిరీత్యా డాక్టర్ అయినా ప్యాషన్ కోసం ఇండస్ట్రీకి వచ్చారు. సెట్‌లో ఆమె కేవలం తన పాత్రకే పరిమితం కాకుండా, సినిమాకు సంబంధించిన ప్రతి పనిలోనూ ఎంతో చురుగ్గా ఉంటారని నరేష్ మెచ్చుకున్నారు.

అయితే ఇదే వేదికపై నరేష్ ఒక చిన్న అడ్వైజ్ కూడా ఇచ్చారు. “సాధారణంగా తెలుగు అమ్మాయిలు అవకాశాలు రావట్లేదు అని బాధపడతారు.. కానీ ఒక్కసారి బ్రేక్ రాగానే పక్క భాషలకు చెక్కేస్తారు” అని అన్నారు. కామాక్షిని ఉద్దేశించి “నువ్వు మాత్రం అలా వెళ్లొద్దు” అని కోరారు.

బయట ఇండస్ట్రీల్లో సినిమాలు చేసినా పర్లేదు కానీ, తెలుగు సినిమాను మాత్రం వదిలేయొద్దని నరేష్ సూచించారు. మొత్తానికి మన తెలుగమ్మాయిల తీరుపై నరేష్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular