Friday, January 16, 2026
HomeMovie News'అఖండ 2' ప్రీమియర్స్ రద్దు.. ఫ్యాన్స్‌కు చివరి నిమిషంలో నిరాశ!

‘అఖండ 2’ ప్రీమియర్స్ రద్దు.. ఫ్యాన్స్‌కు చివరి నిమిషంలో నిరాశ!

akhanda-2-premiere-shows-canceled-technical-issues-overseas-on-track

నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న అఖండ 2: తాండవం రిలీజ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 4 సాయంత్రం వేయాలనుకున్న ప్రీమియర్ షోస్‌కు సాంకేతిక కారణాల వల్ల ఆటంకం ఎదురైంది.

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాల నుంచి అనుమతి వచ్చినా, చివరి నిమిషంలో టెక్నికల్ ఇష్యూస్ కారణంగా ఇండియాలో జరగాల్సిన ప్రీమియర్ షోస్‌ను క్యాన్సిల్ చేస్తున్నట్లు 14 రీల్స్ ప్లస్ సంస్థ అధికారికంగా తెలిపింది. టికెట్లు బుక్ చేసుకున్న అభిమానులు నిరాశకు గురయ్యారు.

“మేము మా వంతు ప్రయత్నం చేశాం, కానీ కొన్ని విషయాలు మా చేతుల్లో లేవు” అని నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కంటెంట్ డెలివరీలో ఆలస్యం లేదా క్యూబ్ సర్వర్లలో సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుందని భావిస్తున్నారు.

ఈ క్యాన్సిలేషన్ కేవలం ఇండియాలోని ప్రీమియర్స్ కు మాత్రమే వర్తిస్తుందని, ఓవర్సీస్ ప్రీమియర్స్ యథావిధిగా షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని మేకర్స్ వెల్లడించారు.

రెగ్యులర్ షోస్ ఎర్లీ మార్నింగ్ షోస్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. డిసెంబర్ 5న ఉదయం నుంచే యథావిధిగా సినిమా ప్రదర్శనలు మొదలవుతాయి. ఓవర్సీస్ టాక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular