
‘అఖండ‘ తర్వాత బాలకృష్ణ-బోయపాటి కాంబోలో వస్తున్న ‘అఖండ 2: తాండవం’పై భారీ అంచనాలున్నాయి. ఈ అంచనాలకు తగ్గట్టే, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అసలైన “దైవ గర్జన”ను వదిలారు. సినిమా ఫస్ట్ సింగిల్ “అఖండ తాండవం” లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ పాట కోసం తమన్ సంగీతంలోని ఇద్దరు దిగ్గజాలను కలిపారు. శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ తమ పవర్‌ఫుల్ గాత్రాలతో పాటకు ప్రాణం పోశారు. కళ్యాణ్ చక్రవర్తి అందించిన సంస్కృత పదాలతో కూడిన లిరిక్స్ (“హే ఖండ ఖండ ఖండితా…”) అఘోరా పాత్రకు సరిగ్గా సరిపోయాయి.
ఈ లిరికల్ వీడియో కేవలం ఆడియో ట్రీట్ మాత్రమే కాదు, విజువల్ ఫీస్ట్ కూడా. మంచు కొండలు, పురాతన ఆలయాల బ్యాక్‌డ్రాప్‌లో, బాలకృష్ణ అఘోరా గెటప్‌లో త్రిశూలం పట్టి కనిపించారు. శంకర్ మాస్టర్ కొరియోగ్రఫీలో బాలయ్య వేసిన తాండవ స్టెప్స్ గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.
తమన్ హెవీ డ్రమ్ బీట్స్, ఇద్దరు లెజెండరీ సింగర్ల గానం కలిసి అద్భుతమైన అనుభూతిని ఇస్తున్నాయి. మేకింగ్ షాట్స్‌లో బోయపాటి, రామ్-లక్ష్మణ్ సీన్స్ వివరిస్తున్న తీరు కూడా చూపించారు. ఈ పాటతో సినిమాపై హైప్ మరో స్థాయికి చేరింది.
ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. “ఇది పాట కాదు.. థియేటర్లో పూనకం లోడింగ్” అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు. స్పీకర్లు బద్దలవ్వడం ఖాయమని అంటున్నారు.
పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘అఖండ’ మ్యాజిక్‌ను ఈ సీక్వెల్ ఏ స్థాయిలో రిపీట్ చేస్తుందో చూడాలి.
