Sunday, October 4, 2026
HomeMovie News'అఖండ 2' సడన్ రిలీజ్: ఫ్యాన్స్ ఒత్తిడి, క్రేజ్ తగ్గకుండా ప్లాన్!

‘అఖండ 2’ సడన్ రిలీజ్: ఫ్యాన్స్ ఒత్తిడి, క్రేజ్ తగ్గకుండా ప్లాన్!

akhanda-2-new-release-date-december-12-damage-control-fan-pressure

గత వారం విడుదల కావాల్సిన నందమూరి బాలకృష్ణ అఖండ 2 మూవీ చివరి నిమిషంలో ఆగిపోవడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ప్రీమియర్స్ పడాల్సిన టైమ్‌లో బ్రేక్ పడటంతో ఆ హైప్ మొత్తం ఒక్కసారిగా చల్లబడింది.

అయితే లీగల్ సమస్యలు ఓ కొలిక్కి రావడంతో, మేకర్స్ ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వారం తిరక్కముందే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఫైనల్‌గా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

నిజానికి నిర్మాతలు క్రిస్మస్ రేసులో నిలపాలని అనుకున్నారు. కానీ ‘ఆలస్యం అమృతం విషం’ అన్నట్లు క్రేజ్ తగ్గే ప్రమాదం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భయపడ్డారు. దీనికి తోడు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది.

వారం రోజులు ఆలస్యమైనా, ప్రేక్షకుల దృష్టి ఇంకా ఈ సినిమా మీదే ఉంది. ప్రమోషన్స్ ఊపు తగ్గలేదు. ఈ బజ్ కంటిన్యూ చేస్తూ థియేటర్లలోకి దిగితే ఓపెనింగ్స్‌కు ఢోకా ఉండదని విశ్లేషకులు అంటున్నారు.

ఆ నష్టాన్ని కవర్ చేయాలంటే సినిమాకు ఓపెనింగ్స్ భారీగా రావాలి. ఇన్ని మలుపులు తిరిగాక వస్తున్న ఈ సినిమాకు ‘పాజిటివ్ టాక్’ రావడం చాలా ముఖ్యం. టాక్ అదిరిపోయిందని వస్తే మాత్రం, బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల జాతర జరగడం ఖాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular