
న్యూస్ డెస్క్: దేశంలోనే ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ వినియోగదారులు సోమవారం పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నారు. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సడన్‌గా పనిచేయకపోవడంతో కాల్స్, మెసేజ్‌లు, డేటా సేవలు నిలిచిపోయాయి.
దీంతో కస్టమర్లు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందారు. గంటల తరబడి ఈ సమస్య కొనసాగడంతో సామాన్య వినియోగదారులు మాత్రమే కాక, ఆఫీసుల పనులు కూడా అంతరాయం కలిగాయి.
డౌన్‌డిటెక్టర్ వెబ్‌సైట్ ప్రకారం, సాయంత్రం నాటికి 2300 కంటే ఎక్కువ మంది ఫిర్యాదులు చేశారు. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఎక్కువ ప్రభావం చూపింది. హఠాత్తుగా కాల్స్ డిస్కనెక్ట్ అవడం, డేటా స్లో అవడం వినియోగదారులకి చిరాకు కలిగించింది.
ఈ పరిణామంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్‌లు వెల్లువెత్తాయి. ‘#AirtelDown’ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ అయింది. “5జీ ప్లాన్ ఉన్నా కనెక్షన్ 3జీ లాగా ఉంది” అని కొందరు ఫిర్యాదు చేస్తే, “అత్యవసర సమయంలో కాల్ చేయలేక ఇబ్బంది పడ్డాం” అంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎయిర్‌టెల్ యాజమాన్యం దీనిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. “నెట్‌వర్క్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. మా టెక్నికల్ టీమ్ వెంటనే సమస్య పరిష్కారానికి పనిచేస్తోంది. వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి క్షమించండి” అని పేర్కొంది.
మొత్తం మీద, దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్ డౌన్ కావడం లక్షల మందికి సమస్యలు తెచ్చిపెట్టింది. నెట్‌వర్క్ త్వరగా పూర్తిగా పునరుద్ధరించబడుతుందని యాజమాన్యం భరోసా ఇచ్చింది.
