Thursday, October 8, 2026
HomeMovie Newsప్రత్యూష తల్లి ఆవేదన: చట్టం వదిలినా.. దేవుడు వదలడు!

ప్రత్యూష తల్లి ఆవేదన: చట్టం వదిలినా.. దేవుడు వదలడు!

actress-pratyusha-mother-sarojini-devi-emotional-comments

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నింపిన నటి ప్రత్యూష మరణం రెండు దశాబ్దాలు దాటినా, ఆమె తల్లి సరోజినీ దేవి న్యాయపోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. తన కుమార్తెది హత్యేనని, ఆ నేరస్థులు శిక్షించబడాలని ఆమె ఇప్పటికీ పోరాడుతున్నారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె తన ఆవేదనను వెళ్లగక్కారు. “నా కళ్ల ముందే నా కూతురిని చంపిన వాళ్లు, వారి కుటుంబ సభ్యులు నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. వారిలో ఎలాంటి పశ్చాత్తాపం లేదు,” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

“16 ఏళ్లకే పరిశ్రమకు వచ్చి, 19 ఏళ్లకే చనిపోయింది. 2002లో తనని చంపేశారు. అప్పటి నుంచి నాది ఒకటే మాట.. నా కూతురిని చంపేశారు, నాకు న్యాయం కావాలి,” అని ఆమె తన పట్టుదలను పునరుద్ఘాటించారు.

ఆసుపత్రిలో తన కుమార్తె చావుబతుకుల్లో ఉన్నప్పుడు కూడా, చికిత్స పేరుతో తనను దగ్గరికి వెళ్లనీయలేదని, అక్కడే రాజకీయాలు మొదలయ్యాయని ఆమె ఆరోపించారు.

డబ్బు, పలుకుబడి లేని కారణంగా నిందితులు చట్టం నుంచి తప్పించుకోవచ్చేమో గానీ, దైవం విధించే శిక్ష నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆమె బలంగా విశ్వసిస్తున్నారు.

ఎప్పటికైనా చట్టం వారిని శిక్షిస్తుందని, ఆ రోజును తాను చూస్తానని సరోజినీ దేవి అన్నారు. తన న్యాయపోరాటం చివరి వరకు కొనసాగిస్తానని ఆమె స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular