
తెలుగు ప్రేక్షకులకు బొమ్మరిల్లు సినిమాతో బాగా దగ్గరైన జెనీలియా, తన 13 ఏళ్ల గ్యాప్ గురించి ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. రితేశ్ దేశ్‌ముఖ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత, కుటుంబ జీవితంలో బిజీగా మారిన ఆమె సినిమాలకు దూరంగా ఉన్నట్లు తెలిపారు.
ఈ గ్యాప్‌లో తాను ఫుడ్ కంపెనీ ప్రారంభించానని, ప్రొడ్యూసర్‌గా మారినట్లు చెప్పారు. సినిమా చేసే టైమ్ కుదరలేదు కాబట్టి నటనకు బ్రేక్ ఇచ్చానని వివరించారు.
ఇప్పుడైతే బాలీవుడ్‌లో సితారే జమీన్ పర్ చిత్రంలో కనిపించి తిరిగి సినిమాల్లోకి అడుగు పెట్టారు. తెలుగులో గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి హీరోగా నటించిన జూనియర్ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా కోసం తాను 100 శాతం కష్టపడ్డానని, మంచి ఛాన్స్ రావడంతో మళ్లీ యాక్టర్‌గా ప్రూవ్ చేసుకునే అవకాశం దొరికిందని చెప్పారు.
బొమ్మరిల్లు సీక్వెల్ కోసం కూడా తాను రెడీగా ఉన్నట్లు చెప్పారు. జూనియర్ లో తన పాత్ర ప్రత్యేకమని, నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.