
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మళ్లీ ఉదృతంగా మారింది. అమెరికా వంటి దేశాలు శాంతి ప్రయత్నాలు చేస్తున్నా, ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉక్రెయిన్ దళాలు రష్యాలోని పలు ప్రాంతాలపై వందకు పైగా డ్రోన్లతో దాడి జరిపాయి.
దీంతో మాస్కో సమీపంలోని నాలుగు ప్రధాన విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
రోసావియాట్సియా ప్రకారం, ఈ దాడుల ప్రభావంతో తొమ్మిది ప్రాంతీయ ఎయిర్పోర్టులు కూడా దెబ్బతిన్నాయి. డ్రోన్లను గగనతలంలోనే తుదిమూఢం చేశామని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపినప్పటికీ, విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం కనిపించింది. ఇదే సమయంలో రష్యా కూడా ఖార్కివ్ సహా ఉక్రెయిన్ నగరాలపై ప్రతిదాడులు చేసింది.
రష్యా ప్రయోగించిన 20కి పైగా డ్రోన్ల దాడుల్లో ఖార్కివ్ మార్కెట్ ధ్వంసమైంది. నాలుగుగురు పౌరులు గాయపడ్డారు. మరోవైపు, బాంబుల దాడుల్లో మరో ఏడుగురికి గాయాలయ్యాయి. దీంతో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
విక్టరీ డే సందర్భంగా మే 8-10 వరకు కాల్పుల విరమణను ప్రకటించినప్పటికీ, ఈ తాజా ఘర్షణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత ముదిర్చేలా కనిపిస్తున్నాయి.
