Thursday, February 12, 2026
HomeLife Style83 ఏళ్ల అన్యోన్యత.. ప్రపంచ రికార్డు సృష్టించిన వృద్ధ దంపతులు!

83 ఏళ్ల అన్యోన్యత.. ప్రపంచ రికార్డు సృష్టించిన వృద్ధ దంపతులు!

83-years-marriage-world-record-eleanor-lyle-gittens

న్యూస్ డెస్క్: పెళ్లి ఫోటోలు చేతికి రాకముందే విడాకులు తీసుకుంటున్న నేటి స్మార్ట్‌ఫోన్ యుగంలో, 83 ఏళ్ల పాటు కలిసి జీవించడం ఓ అద్భుతమే. అలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించారు అమెరికాకు చెందిన ఎలీనర్ గిట్టెన్స్ (107), లైల్ గిట్టెన్స్ (108).

ప్రపంచం భయంతో వణికిపోతున్న రెండో ప్రపంచ యుద్ధ సమయంలో (1942లో) ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. నేటికీ అదే ప్రేమతో కలిసి జీవిస్తూ, ‘ప్రపంచంలో అత్యధిక కాలం వివాహ బంధంలో ఉన్న జీవించి ఉన్న జంట’ (Oldest Living Married Couple)గా ప్రపంచ రికార్డు సృష్టించారు.

వారి బంధం వెనుక ఉన్న రహస్యం గురించి అడిగితే, ఎలీనర్ (పాఠశాల ఉపాధ్యాయురాలు) సింపుల్‌గా సమాధానమిచ్చారు. “మేము ఎప్పుడూ ఒకరినొకరు మార్చాలని చూడలేదు, కేవలం అర్థం చేసుకోవడానికే ప్రయత్నించాం” అని ఆమె అన్నారు.

దానికి లైల్ (ఇంజనీర్) చమత్కరిస్తూ, “మా బంధంలో నా చివరి మాట ఎప్పుడూ ‘సరే ప్రియతమా’ (Yes, dear) అనే” అని నవ్వేశారు. ఈ ఒక్క వాక్యం వారి బంధంలోని పరస్పర గౌరవాన్ని తెలియజేస్తుంది.

గతంలో ఈ రికార్డు బ్రెజిల్‌కు చెందిన మనోయల్, మరియా (85 ఏళ్లు) పేరిట ఉండేది. వారి మరణానంతరం, ఇప్పుడు ఈ అరుదైన రికార్డు గిట్టెన్స్ దంపతుల సొంతమైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Most Popular