
బుల్లి తెర స్టార్ నుంచి వెండి తెర హీరోగా మారిన సుడిగాలి సుధీర్ మళ్లీ పెద్ద ఎత్తున హంగామా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇంతకాలం మంచి కథ కోసం వెయిట్ చేసిన అతనికి, ఇండస్ట్రీలో మెగా ఫ్యాన్‌గా పేరున్న శివ చెర్రీ ప్రొడ్యూసర్‌గా ముందుకొచ్చాడు.
కొత్త సినిమాకు సంబంధించి అధికారిక పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రత్యేకత ఏంటంటే ఇది పాన్ వరల్డ్ మూవీ అంటూ ప్రమోట్ చేయడం. చాలా భాషల్లో టైటిల్ పదాలు కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
ఇంతవరకు కథ, దర్శకుడు ఎవరనేది క్లారిటీ రాలేదు. కానీ ఈ మిస్టరీ కారణంగానే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. శివ చెర్రీ తన మీడియా పరిచయాలతో సినిమాను భారీగా ప్రమోట్ చేసే అవకాశం ఉంది.
కాలింగ్ సహస్త్ర తర్వాత హీరోగా పెద్దగా కనిపించని సుధీర్, ఈసారి మాత్రం మాస్ అట్రాక్షన్ ఇచ్చేలా పెద్ద బడ్జెట్ సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నాడు. అభిమానులు కూడా వెండి తెరపై సుధీర్ సత్తా చాటాలని ఎదురుచూస్తున్నారు.
ప్రస్తుతం టైటిల్ “హైలెస్సో” అనే టాక్ వినిపిస్తున్నా, ఇంకా ఆఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేదు. పోస్టర్ కారణంగా సోషల్ మీడియాలో #SS5 ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది.
మొత్తానికి, సుడిగాలి సుధీర్ ఈసారి హీరోగా బాక్సాఫీస్‌లో తన మార్క్ చూపిస్తాడా లేదా అన్నది చూడాల్సిందే.
