
ఇండియన్ సినిమా దగ్గర ఎస్.ఎస్. రాజమౌళిని చూసి గర్వపడే స్థాయిలో, గతంలో దర్శకుడు శంకర్ సెట్ చేసిన స్టాండర్డ్స్ అన్నీ ప్రత్యేకమే. రోబో వంటి విజువల్ వండర్ సినిమాతో అందరికీ పరిచయమైన శంకర్, ఇప్పుడీ తరం కోసం మరో భారీ ప్రయత్నం చేస్తున్నాడు.
తాజాగా శంకర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. “నాకు ఒకప్పుడు రోబో డ్రీం ప్రాజెక్ట్ అయితే, ఇప్పుడు వేళ్పారి నా డ్రీం ప్రాజెక్ట్” అని చెప్పాడు. ఈ సినిమా కోసం అతను భారీ స్థాయిలో ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
వేళ్పారి సినిమాను ఒక ప్రౌడ్ ఇండియన్ తమిళ్ సినిమాగా నిలిపేందుకు శంకర్ ప్రయత్నిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌లో అవతార్ మరియు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తరహాలో టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్స్ చూపించే ఉద్దేశంతో ఉన్నాడు.
ఈ ప్రకటనతోనే హాట్ డిస్కషన్స్ మొదలయ్యాయి. బడ్జెట్ విషయంలో రిస్క్ తీసుకుంటున్నాడని, మళ్లీ డబ్బులు వేస్ట్ అయ్యే అవకాశముందని కొంతమంది భావిస్తున్నారు.
24 గంటల ఫుటేజ్ ప్లాన్ చేయబోతున్నారని కూడా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయినా శంకర్పై అభిమానులు మళ్లీ ఆ హై స్టాండర్డ్ మagic కోసం ఎదురుచూస్తున్నారు.
shankar velpari movie, robo to velpari, dream project velpari, shankar comments, visual wonder indian cinema
