
బల్గేరియాలో 1911లో జన్మించిన బాబా వంగా బాల్యంలోనే చూపు కోల్పోయినా, అసాధారణమైన మానసిక సామర్థ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. 9/11 దాడులు బరాక్ ఒబామా ఎన్నిక వంటి కీలక సంఘటనలను ఆమె ముందుగానే ఊహించి చెప్పడంతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు.
బాబా వంగా చెప్పిన ప్రవచనాత్మక దర్శనాలలో 2025 సంవత్సరానికి సంబంధించినవి చాలావరకు నిజమయ్యాయని కొందరు భావిస్తున్నారు. ఈ ఏడాదిలో అనేక ప్రకృతి వైపరీత్యాలు, భౌగోళిక, రాజకీయ సంక్షోభాలు సామాజిక తిరుగుబాట్లు చోటుచేసుకున్నాయి.
దీనికి నిదర్శనంగా మయన్మార్‌లో సంభవించిన విపత్కర భూకంపాన్ని చెబుతున్నారు. ఈ భూకంపం కారణంగా దాదాపు 1700 మంది చనిపోయారు. అలాగే విమానాలు కూలిపోవడం, తుఫానులు, వరదలు వంటి అనేక విపత్కర పరిస్థితులు ప్రపంచం ఎదుర్కొంది.
వరదలు తుఫానులు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తాయని బాబా వంగా ముందుగానే తెలిపారు. రీసెంట్‌గా వచ్చిన దిత్వా తుఫాను కారణంగా ఒక్క శ్రీలంకలోనే 153 మందికి పైగా ప్రజలు చనిపోయారు. మలేషియా, థాయిలాండ్, ఇండోనేషియా, శ్రీలంకలో భారీ వరదలు ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయి.
మొత్తంగా చూసుకుంటే ఈ ఏడాది బాబా వంగా చెప్పిన జోష్యం దాదాపు ఫలించింది అన్న వార్తలు వినిపిస్తున్నాయి. 2026 మొదట్లో కూడా ప్రకృతి వైపరీత్యాల కారణంగా భయంకరమైన విధ్వంసం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆమె తెలిపారు.
