
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న SSMB29 చిత్రానికి సంబంధించి మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ బాబు డూప్స్ వినియోగించకుండా స్వయంగా యాక్షన్ సీన్స్ చేస్తారన్న వార్త చర్చనీయాంశమైంది. అడ్వెంచర్, ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ సినిమాలో యాక్షన్ భారీగా ఉండనున్న సంగతి తెలిసిందే.
మహేష్ ఈ చిత్రంలో ఫిజికల్‌గా చాలానే కష్టపడుతున్నారని, షూటింగ్‌కు ముందే స్టంట్ ప్రాక్టీస్ మొదలుపెట్టారంటూ ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా హై రిస్క్ యాక్షన్ ఎపిసోడ్స్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నారట.
ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ ముగించుకున్న టీమ్, త్వరలో కెన్యా వెళ్లనుంది. అక్కడ అడవిలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత సెట్స్‌లో వారణాసి సన్నివేశాలు షూట్ చేస్తారు. ఈ షెడ్యూల్‌కి కూడా యాక్షన్ కీలకం.
ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, మాధవన్‌లతో కలిసి మహేష్ నటించనున్న ఈ పాన్ వరల్డ్ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
మొత్తానికి ఈ సినిమా మహేష్ కెరీర్‌లో కొత్త అధ్యాయం తెరలేపనుందనడం అతిశయోక్తి కాదు. డూప్‌లకు “నో” చెప్పిన ఆయన ప్రయత్నం, ప్రేక్షకుల్ని థ్రిల్ చేసేలా ఉంది.
