
స్పోర్ట్స్ డెస్క్: ఐపీఎల్ 2025లో అంచనాలు తీరని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొత్త మార్పులతో ముందుకు వెళ్తోంది. తాజాగా భారత మాజీ పేసర్ వరుణ్ ఆరోన్‌ను బౌలింగ్ కోచ్‌గా నియమించినట్లు అధికారికంగా ప్రకటించింది.
డేల్ స్టెయిన్ తర్వాత బాధ్యతలు చేపట్టిన జేమ్స్ ఫ్రాంక్లిన్ హయాంలో పెద్దగా ఫలితాలు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వరుణ్ ప్రస్తుతం కామెంటరీ బాక్స్‌లో ఉన్న సమయంలోనే ఈ ప్రకటన రావడం విశేషం.
భారత్ తరఫున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడిన వరుణ్, 2011 నుంచి 2015 వరకూ అంతర్జాతీయ స్థాయిలో పేసర్‌గా ప్రభావం చూపారు. ఆఖరిసారిగా జార్ఖండ్ తరపున 2024లో విజయ్ హజారే ట్రోఫీలో బరిలో దిగారు.
తాజా కాలంలో కామెంటరీ బాక్స్‌లో క్రికెట్ విశ్లేషణలతో ఆకట్టుకున్న వరుణ్‌కు ఇప్పుడు కొత్త బాధ్యతలు వచ్చాయి. సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగాన్ని గాడిలో పెట్టేందుకు ఇది కీలక నిర్ణయంగా భావిస్తున్నారు.
ఇంగ్లాండ్‌లో భారత్-ఇంగ్లాండ్ సిరీస్‌లో కామెంటరీ చేస్తూ ఉన్న వరుణ్ నియామకం గురించి తెలుసుకోవడం అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇక ఐపీఎల్ 2026లో వరుణ్ మార్గదర్శనంలో ఎస్ఆర్‌హెచ్ పేస్ విభాగం ఎలా మెరుగుపడుతుందో చూడాలి.
